నగరపాలక సంస్థలో రెవెన్యూ, ప్రణాళిక, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు
నెల్లూరు: నగరపాలక సంస్థ విభాగం వార్డు అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, పట్టణ ప్రణాళిక విభాగం వార్డు సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు,T.P.B.O.లు,A.C.Pలకు గురువారం కమిషనర్ వై.ఓ నందన్ షోకాజు నోటీసులను జారీ చేశారు.
స్థానిక 20/1 టైలర్స్ కాలనీ సచివాలయం పరిధిలో హౌస్ టాక్స్ పన్ను విధింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా సంబంధిత వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శి ఆర్.నవితాదేవి, పూర్వపు అడ్మిన్ కార్యదర్శి టి.జయమ్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాసులకు షోకాజు నోటీసులు జారీ చేశారు.
స్థానిక 21/3 మాగుంట లేఔట్ సచివాలయం పరిధిలోని మినీ బైపాస్ ప్రాంతంలో A1 ఫ్యాషన్ సమీపంలో పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులను ఉల్లంఘించి అదనపు అంతస్తు నిర్మాణం జరుగుతున్నట్లు కమిషనర్ క్షేత్రస్థాయిలో గమనించి విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా సంబంధిత వార్డు సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శి కె .కళ్యాణ్, T.P.B.O.ఎస్.మురళి, A.C.P పి.వేణు లకు షోకాజు నోటీసులను జారీ చేశారు.
అదేవిధంగా స్థానిక 22/1 మదర్ తెరిసా సచివాలయం పరిధిలోని మినీ బైపాస్ ప్రాంతంలో సిద్ధార్థ కాలేజ్ ఎదురుగా పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు లేకుండా భవన నిర్మాణం జరగడాన్ని కమిషనర్ క్షేత్రస్థాయిలో గమనించి విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా సంబంధిత సచివాలయ వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శి పి. కేశవనాథ్, T.P.B.O కె. భరత్ కుమార్ రెడ్డి లకు షోకాజు నోటీసులను జారీ చేశారు.
పైన వివరించిన కారణాలపై సంబంధిత వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు, T.P.B.O లు, A.C.P మూడు రోజుల లోపు సంతృప్తికరమైన వివరణతో జవాబు ఇవ్వని పక్షంలో క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుంటామని కమిషనర్ నోటీసు ద్వారా హెచ్చరించారు.

