జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు-కలెక్టర్లు హిమాన్షు శుక్ల-వెంకటేశ్వర్
నెల్లూరు/తిరుపతి: దీపావళి పండుగ సందర్భంగా నెల్లూరు-తిరుపతి జిల్లా ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్లు హిమాన్షు శుక్ల-వెంకటేశ్వర్ లు ఒక ప్రకటనలో తెలిపారు. అంధకారంపై వెలుగు విజయం సాధించిన దీపావళి పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఐకమత్యం, సంతోషం నింపాలని వారు ఆకాంక్షించారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలుగించుకోవాలనే తాత్వికతను దీపావళిపండుగ మనకు అందిస్తుందని పేర్కొన్నారు.
పర్యావరణహిత దీపావళి జరుపుకోవాలి:-దీపావళి అంటే వెలుగుల పండుగ అని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ బాణాసంచాను కాల్చుకోవాలని సూచించారు. పర్యావరణహితం కోసం పెద్దపెద్ద శబ్దాలు, కాలుష్యం వెదజల్లే టపాసులు కాకుండా వెలుగుదివ్వెలు విరజిమ్మే టపాసులు కాల్చాలన్నారు. తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంధకారంపై వెలుగు సాధించిన పండుగ దీపావళి స్ఫూర్తితో జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఈ దీపావళి పర్వదినాన్ని జరుపుకోవాలని కలెక్టర్లు ఆకాంక్షించారు.

