DISTRICTS

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛందలో భాగంగా మొక్కలు నాటిన కలెక్టర్

నెల్లూరు: జిల్లావ్యాప్తంగా శనివారం స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా సుమారు 5 లక్షల మంది పాల్గొంటున్నట్టు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. శనివారం బీవినగర్ లోని పార్క్ లో స్వర్ణాంధ్ర -స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఎనిమిది నెలల నుండి స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం విజయవంతంగా నెల్లూరులో నిర్వహిస్తున్నామన్నారు. నవంబర్ నెలలో వర్షాలు రానున్న నేపథ్యంలో ఈనెల 17 నుండి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛత సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కే.కార్తీక్, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *