NATIONALOTHERSWORLD

భారతీయులు,రష్యా సైన్యంలో చేరేందుకు ఇచ్చే ఆఫర్లకు దూరంగా ఉండాలి-విదేశాంగ శాఖ

అమరావతి: భారతీయులు రష్యా సైన్యంలో చేరమని ప్రలోభపెట్టి,,ఫ్రంట్ లైన్ లోకి పంపుతున్నట్లు తాజా నివేదికల వస్తున్న దృష్ట్యా,, రష్యా-ఉక్రెయిన్ వివాదం నుంచి దూరంగా ఉండాలని భారతదేశం గురువారం మరోసారి తన పౌరులను కోరింది..రష్యా సైన్యం చేరేందుకు వచ్చే ఆఫర్లు ప్రమాదకరమని హెచ్చరించింది..ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో కొందరు భారతీయులు రష్యా సైన్యం తరఫున పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో రష్యా సైన్యం తమ తరపున పోరాడేందుకు బలవంతంగా వినియోగించుకుంటోందంటూ పలువురు బాధితులు ఇప్పటికే తమ ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ వ్యవహారంపై కేంద్రం తాజాగా స్పందించింది.. ఈ మేరకు కీలక సూచన చేసింది. రష్యా సైన్యం ఆఫర్లు ప్రమాదకరమని హెచ్చరించింది.. భారతీయులు రష్యా సైన్యంలో చేరొద్దంటూ సూచించింది.. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.. రష్యా సైన్యంతో పనిచేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించిందని తెలిపారు.. రష్యా సైన్యంలో చేరేందుకు ఇచ్చే ఆఫర్లకు దూరంగా ఉండాలని సూచించారు.. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న వారిని వెనక్కి పంపించాలని కోరుతూ మాస్కో అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు బాధిత కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *