నెల్లూరు నగర ప్రజలకు సురక్షిత నీరు అందించడమే లక్ష్యం-మంత్రి నారాయణ
14 డివిజన్ జగదీష్ నగర్ పార్క్ వద్ద…
నెల్లూరు: రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన గత వైసిపి ప్రభుత్వం… అవగాహన రాహిత్యంతో నెల్లూరులోని పలు అభివృద్ధి పనులకు సంబంధించి రూ.135 కోట్ల మేర అప్పులు పాలు చేసిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరు నగర పరిధిలోని 14వ డివిజన్ జగదీష్ నగర్ పార్క్ వద్ద అదానీ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని శుక్రవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014-2019 ఏడాదిలోనే ఆరు మదర్ ప్లాంట్లు, 60 చిన్న ప్లాంట్ల ఏర్పాటుకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. దాంతో నగరవాసులకు ఆరు లక్షల లీటర్లను అందజేసే విధంగా పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్..టీడీపీ సీనియర్ నేత విజయ భాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేతారెడ్డి, కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి ,టిడిపి ప్రెసిడెంట్ సాయి ..టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.