స్మార్ట్ స్ట్రీట్ బజార్ పనులను వేగవంతం పూర్తి చేయండి-కమిషనర్
నెల్లూరు: పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం మైపాడు రోడ్డు జాఫర్ సాహెబ్ కెనాల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రాజెక్టు నిర్మాణ పనులను కమిషనర్ వై.ఓ నందన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. స్థానిక రంగనాయకులపేట పినాకిని పార్కును కమిషనర్ సందర్శించి పార్కులో అవసరమైన అన్ని వసతులను కల్పించాలని ఆదేశించారు.
మినీ బైపాస్ ప్రాంతంలో రోడ్డును ఆక్రమిస్తూ నిర్వహిస్తున్న నర్సరీ, వినాయక విగ్రహాల నిర్వాహకులతో కమిషనర్ మాట్లాడి ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు.కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్ ఇ రామ్ మోహన్ రావు, సిటీ ప్లానర్ హిమబిందు పబ్లిక్ హెల్త్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.