హత్య కేసులో జీవిత ఖైదీ రౌడీషీటర్ శ్రీకాంత్, ఆసుపత్రిలో రాసలీలలు?
తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు..
గంజాయి పట్టుకునేందుకు గాల్లో కాల్పులు జరిపినా…..రౌడీషీటర్లు ఆసుపత్రిల్లో రాసలీలు జరిపేందుకు అవకాశం కల్పించినా? ఇందుకు కథ,స్కీన్ ప్లే,,డైరెక్షన్ ఘనత నెల్లూరు జిల్లా పోలీసులకే దక్కుతుంది.. వారికి ఆశించింది వారికి అందితే?? చట్టాలను చాపలా చుట్టేస్తారు..ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు..
నెల్లూరు: జిల్లా సెంట్రల్ జైలులో హత్య కేసులో రౌడీషీటర్ శ్రీకాంత్ జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.. శ్రీకాంత్ అనారోగ్యం పేరుతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఒక మహిళతో ఆసుపత్రి బెడ్ పైనే మర్దన కార్యక్రమం చేపట్టాడు..ఈ సంఘటన తీపి గుర్తుగా వుంచుకునేందుకు,శ్రీకాంత్ కు సంబంధించిన వారే వీడియో తీయడం,,సదరు వీడియో బయటకు రావడంతో నెల్లూరు పోలీసుల పెద్ద మనస్సు??? పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి..
తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు:-
నెల్లూరు: 22 కిలోల గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు..అదివారం నెల్లూరు నగరంలో పోలీసులు రాజమండ్రికి చెందిన సూర్య ప్రకాష్ అనే వ్యక్తి కారులో గంజాయి తరలిస్తుండగా..SVGS కాలేజీ సమీపంలో పోలీసులు సినిమా తరహాలో ఛేజింగ్ చేసి ప్రకాష్‌ను పట్టుకోవాడానికి ప్రయత్నం చేశారు.. పోలీసుల నుంచి తప్పించునే ప్రయత్నంలో ప్రకాష్ వేగంగా కారుతో పోలీసు వాహానాన్ని ఢికొట్టాడు.. ఈ ఘటనలో పోలీస్ జీప్ లోని కానిస్టేబుల్ ఫిరోజ్‌కి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ప్రాణ రక్షణ కోసం సీఐ సాంబశివరావు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.. అనంతరం ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు..ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎస్పీ కృష్ణ కాంత్ మీడియాకు వెల్లడించారు.