గంగైకొండచోళపురంను సందర్శించిన ప్రధాని మోదీ
ఆధ్యాత్మిక-సాంస్కృతిక వారసత్వం..
అమరావతి: తమిళనాడులోని మారుముల ప్రాంతంలో వున్న గంగైకొండచోళపురంను ఆదివారం సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,, చోళ రాజవంశ ఆధ్యాత్మిక-సాంస్కృతిక వారసత్వాన్ని దేశ ప్రజలకు గుర్తుచేశారు.. గంగైకొండచోళపురం దేవాలయాని సందర్శించిన సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గంగ నీరు తీసుకువచ్చి దేవాలయానికి సమర్పించారు..
భావోద్వేగాలతో మమేకం:- ప్రధాని మోడీ ఒక ప్రాంతానికి పర్యటనకు వెళ్లే ముందు ఆ ప్రాంతం గురించి ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తారో, అక్కడ ప్రాచీన సంస్కృతిని అక్కడ ప్రజలకు మళ్ళీ ఎలా గుర్తు చేస్తారో, వారితో ఎంత భావోద్వేగాలతో మమేకం అవుతారో అని చెప్పడానికి ఈ రోజు గంగా జలం ఈ దేవాలయానికి సమర్పించడం అనే సంఘటన ఒక రుజువు..
1000 సంవత్సరాల తరువాత:- రాజా రాజ చోళుడు (985-1014 CE), చోళ రాజవంశంలో ఒక ప్రముఖ రాజు. అతను తంజావూరులోని బృహదీశ్వర దేవాలయం నిర్మాణం చేసి ప్రసిద్ధి చెందారు. ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడు (1014-1044 CE), గంగా నదీ ప్రాంతంలో విజయ యాత్రలు చేసి, ఆ విజయ చిహ్నంగా గంగ నీరును అప్పటి తమిళనాడు రాజధాని గంగైకొండచోళపురంకు తీసుకొచ్చి ఆ జలాన్ని “చోళ గంగం” అని పిలిచే చిలుక మండపంలో నిల్వ చేసి ఉంచారు. అంటే వెయ్యి సం..ల క్రిందట రాజేంద్ర చోళుడు గంగా జలాన్ని గంగైకొండచోళపురం కు తీసుకువస్తే… వెయ్యి సం..ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మళ్ళీ అలాగే గంగాజలాన్ని అలాగే తీసుకువచ్చి అక్కడ తమిళ పూజరులకు స్థానిక ప్రజలకు తమ ప్రాచీన తమిళ రాజుల వారసత్వాన్ని ఒక్కసారిగా కళ్ళ ముందు నిలిపారు.గత ప్రభుత్వాల పాలనలో సనాతన సంప్రాదాయ వారసత్వంను చీకటి తెరలు కమ్మెస్తున్న తరుణంలో,,పాలన పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ,,చీకటి తెరలను చేధిస్తూ, సనాతన సంప్రాదాయంను ప్రపంచ వ్యాప్తం చేయడంతో పాటు భారతీయుల మనస్సులో అంతర్భగామైన సనాతన సంప్రాదాయ వారసత్వంను సృశిస్తూన్నడు అనేందుకు గంగైకొండచోళపురం సందర్శన ఒక ఉదహరణ మాత్రమే..

