కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1961 నాటి ఆదాయ పన్ను చట్టంలోని కఠిన నిబంధనలు,, పదాలు,, వివరణలను సరళతరం చేస్తూ ఈ Income Tax Bill ను ప్రవేశపెట్టామని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు..ఈ ఆదాయ పన్ను బిల్లును లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి సూచించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు..కొత్త ఆదాయ పన్ను చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది.. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీల సభ్యులు గందరగోళం సృష్టించారు..వారు నినాదాలు చేస్తుండగానే,, బిల్లును ప్రవేశపెట్టే తీర్మానానికి లోక్‌సభలోని మెజారిటీ సభ్యుల నుంచి స్పీకర్ ఆమోదాన్ని పొందారు.. అనంతరం విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు..ఈ విపక్ష పార్టీల సభ్యులు కేకలు,ఆరుపుల మద్యనే లోక్‌సభ సమావేశాలను మార్చి 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు..నూతన ఆదాయపు పన్ను బిల్లును లోక్‌సభ సెలెక్ట్ కమిటీ సమీక్షించి,, దాని నివేదికను తదుపరి లోక్‌సభ సమావేశాల్లో మొదటి రోజున స్పీకర్‌కు సమర్పించనున్నారు..సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఛైర్మన్,, బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ వక్ఫ్ సవరణ బిల్లుపై తాము రూపొందించిన నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.