NATIONALWORLD

ఇరాన్ నుంచి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం

అమరావతి: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్‌లో నివసిస్తున్న దాదాపు 10,000 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సురక్షిత ప్రాంతాలకు:- భద్రతాపరమైన ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి భారత పౌరులను, ముఖ్యంగా విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.. ఇరాన్‌లోని ఉర్మియా నగరంలో ఉన్న 100 మంది భారత విద్యార్థులు ఇప్పటికే అర్మేనియా సరిహద్దుకు సురక్షితంగా చేరుకున్నారు..త్వరలోనే వారిని ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకురానున్నారు.. ఇజ్రాయెల్ దాడుల భయం ఎక్కువగా ఉన్న రాజధాని టెహ్రాన్‌లోని 600 మంది విద్యార్థులను సురక్షిత నగరమైన క్వోమ్‌కు తరలించారు.. అదే విధంగా, షిరాజ్, ఇస్ఫహాన్ నగరాల్లోని విద్యార్థులను యాజ్ద్ అనే సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రక్రియ జరుగుతొంది..ఎస్.జయశంకర్ స్వయంగా:- విదేశాంగ శాఖ,, భారత రాయబార కార్యాలయం ఇరాన్ లోని పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయి..విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ స్వయంగా అర్మేనియా విదేశాంగ మంత్రితో అలాగే యూఏఈ ఉపప్రధానితో మాట్లాడి, భారతీయుల తరలింపునకు సహకరించాలని కోరారు.. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం విద్యార్థులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పిస్తోంది.. ఇరాన్‌లో చిక్కుకుపోయిన తమ పిల్లలను వెంటనే స్వదేశానికి రప్పించాలని కశ్మీర్‌కు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు..అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు:- ఇరాన్‌లో ఉన్న భారతీయులు, వారి కుటుంబ సభ్యుల సహాయార్థం భారత ప్రభుత్వం 24/7 పనిచేసే కంట్రోల్ రూమ్‌లను, హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *