ఉగ్రవాదులు, ఆర్మీకి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 4 ఆర్మీ సిబ్బంది మృతి
అమరావతి: జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది..సోమవారం జమ్మూలోని దోడా జిల్లాలో దేశా అటవీ ప్రాంతంలోని ధరి గోటే ఉరర్‌బాగిలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది..ఈ సంఘటనలో ఒక ఆర్మీ అధికారితో సహా ముగ్గురు సైనికులు మరణించారు.. దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి 7.45 గంటలకు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు..ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతాసిబ్బందికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బందితోపాటు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, పరిస్థితి విషమించి క్షతగాత్రులు వీర మరణం పొందినట్లు అధికారులు తెలిపారు..
జమ్మూకశ్మీర్‌లో వారం వ్యవధిలో ఇది 4వ ఎన్‌కౌంటర్.. ఈ ఆపరేషన్‌కు కోఠి అని పేరు పెట్టారు..సోమవారం రాత్రి ఎదురు కాల్పులు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి..మరి కొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారంతో చీకటి, దట్టమైన అడవిని ఉపయోగించుకుని ఉగ్రవాదులు తప్పించుకోకుండా నిరోధించడానికి,, భద్రతా దళాలు సంబంధిత ప్రాంతాన్ని చుట్టుముట్టాయి..ఇటీవలి కాలంలో జమ్మూ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి..ముఖ్యంగా పూంచ్, దోడా, రాజౌరి, రియాసి వంటి సరిహద్దు జిల్లాల్లో ఉగ్ర దాడుల చొరబడుతున్న నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.. మరోవైపు ఉగ్రవాదులు కూడా భద్రతా బలగాలను తప్పుదారి పట్టించేందుకు పలు వ్యూహాలను అవలంబిస్తున్నారు..
ప్రస్తుతం జమ్మూ డివిజన్‌లో 50 మంది ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నరని నిఘావర్గాల సమాచారం.. ఈ ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది పాకిస్థానీయులే,, వారిని నిర్మూలించేందుకు ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందాలు జమ్మూ డివిజన్‌లోని వివిధ జిల్లాల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నాయి.. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు పాకిస్థాన్ చేస్తున్న నీచమైన కుట్రలను ఇంకా ఆపడం లేదు.