AP&TG

రెండున్నరేళ్ల సుపరిపాలనకు స్థానిక ఎన్నికల తీర్పు నిదర్శనం-ముఖ్యమంత్రి

రూ.500 నోటు రద్దు చేయాలి..

కొన్ని చోట్ల ఓటమిపై సమీక్ష..

తప్పులు సరిదిద్దుకుంటాం..

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేశారని, తమ కోసం కష్టపడుతున్న ప్రభుత్వాన్ని గుర్తించి అండగా నిలిచారని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రెండున్నరేళ్ల సుపరిపాలనకు, అభివృద్ధికి ఆమోదం తెలిపారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు అందించిన ఘనవిజయం ప్రభుత్వ పనితీరుకు లభించిన గుర్తింపు అని చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలపై సోమవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… గుడ్ గవర్నెన్స్ లీడ్స్ టు గుడ్ పాలిటిక్స్ అన్నది తన నమ్మకమని, సుపరిపాలన అందిస్తే ప్రజలు రాజకీయంగానూ ఆదరిస్తారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. 2024 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు కూటమికి ప్రజల ఆదరణ మరింత పెరిగిందని, వైసీపీని గతంలో కంటే ఎక్కువగా ప్రజలు తిరస్కరించారని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలు, పరిషత్ ఎన్నికలు.. ఈవీఎంలు, బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్లు.. ఏ విధంగా చూసినా ప్రజల మద్దతు కూటమికే లభించిందన్నారు. ప్రజలు కేవలం పార్టీలను మాత్రమే కాకుండా, అభ్యర్థుల గుణగణాలను, వారి నేపథ్యాన్ని కూడా విశ్లేషించి ఓటు వేశారని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని, ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించారని అన్నారు. రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రూ.500 నోటు రద్దు చేయాలి:- రూ.500 నోట్ల గురించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రూ.500 నోటు రద్దు చేయాలని, రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతి నిర్మూలనకు డిజిటల్‌ కరెన్సీ ఉత్తమమని, డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాలని సూచించారు. ఈ మేరకు దీని గురించి ప్రధాని మోదీకి సూచనలు చేస్తూనే ఉంటానని, టెక్నాలజీ బాగుంటే సంపద సృష్టి జరుగుతుందని స్పష్టం చేశారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *