అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్
అమరావతి: స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు చేతులు, కాళ్ళకు గాయాలు అయ్యాయి.. పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా సంతనమైన మార్క్ శంకర్(8) సింగ్ పూర్ లోని ఓ స్కూల్ లో చదువుకుంటున్నాడు..మంగళవారం ఉదయం స్కూల్ జరిగిన అగ్నిప్రమాదంలో శంకర్ చిక్కుకున్నాడు.. దట్టంగా అలుముకున్న పొగ ఉపిరితిత్తులోకి వెళ్లడంతో, ఉక్కిరిబిక్కిరి అయన శంకర్ కు చేతులకు,,కాళ్లకు గాయాలు అయ్యాయి..అగ్ని ప్రమాదం కారణంగా గాయాపడిన విద్యార్దులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..మనం పర్యాటనలో వున్న పవన్ కల్యాణ్ కు పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు..‘అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని,, ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని,, కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటాన’ని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు.. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు..అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..పవన్ కల్యాణ్‌కు మెగా కుటుంబ సభ్యులు ఫోన్ చేసి సింగపూర్‌లో ప్రస్తుత పరిస్థితిపై సమాచారం తెలుసుకుంటున్నారు.. సింగపూర్ వైద్యులతో పవన్ కల్యాణ్, చంద్రబాబు మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సింగపూర్ వైద్యులు తెలిపారు.