AP&TG

మతిస్థిమితం లేనివారితో రాజకీయం చేయడం ఇదే మొదటి సారి-ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: రాజధానిపై నిలకడలేని మాటలు మాట్లాడుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్షంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై విమర్శలు కురిపించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ పనులను చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలోని జిందాల్‌ పారిశ్రామిక పార్కును వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, వైసీపీపై కూడా ఆయన వ్యాఖ్యానించారు.

మతిస్థిమితం లేనివారితో:- సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, 2014లో రాష్ట్ర విభజన జరిగాక అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో ఒప్పుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నారు.. నాటకాలు ఆడారు. అధికారం పోయాక, కేంద్రం చట్టం చేశాక మావిగన్ అన్నారు. నిన్న విజయవాడ రాజధాని అన్నారు.. రేపు ఏం అంటారో తెలీదు అని ఎద్దేవా చేశారు. మతిస్థిమితం లేనివారితో రాజకీయం చేయడం ఇదే మొంటి సారి అంటూ వ్యాఖ్యనించారు. సొంత బాబాయిని చంపి.. నా చేతిలో కత్తిపెట్టి నేరం నాపై మోపి రాజకీయ లబ్ధి పొందారు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు చేశారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *