అర్ధంతరంగా కెనడా పర్యటనను ముగించుకుని అమెరికాకు బయలుదేరిన ట్రంప్
అమరావతి: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమైన నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని అమెరికా బయలుదేరారు..G-7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మంగళవారం ట్రంప్ కెనడాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాల్సి ఉంది.. న్యూక్లియర్ ప్రోగ్రాంపై చర్చలకు రావలని కెనడా నుంచే ఇరాన్‌ను కోరిన ట్రంప్,, తక్షణమే టెహ్రాన్‌ను అంతా ఖాళీ చేయాలంటూ సామాజిక మధ్యమంలో పోస్టు చేశారు.. ఇజ్రాయెల్,, ఇరాన్ యుద్ధంపై మీడియా అడిగిన ప్రశ్నలకు తొలుత స్పందించేందుకు నిరాకరించిన ట్రంప్‌న, కొంత సేపటి తరువాత సామాజిక మధ్యమంలో ఇరాన్‌కు హెచ్చరికలు చేసి అమెరికా బయలుదేరివెళ్లారు..ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందిస్తేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ హడావుడిగా అమెరికా వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది..ఈ పరిణామాలను పట్టి చూస్తే,,ఇరాన్ పై ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున్న దాడులకు సిద్దమైనట్లు కన్పిస్తొంది..చూడాలి మరి ఏలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో?

