ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ దశ రేపటి నుంచే ప్రారంభం-చీఫ్ ఎలక్షన్ కమిషనర్
అమరావతి: దేశ వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)లో భాగంగా రెండో దశలో ఆ ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభం కానున్నది..12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో SIR చేపడుతున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సోమవారం ప్రకటించారు..ఈ సందర్బంలో అయన మీడియా సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.. SIR ఎస్‌ఐఆర్‌లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు లిస్టును పరిశీలిస్తారు..జాబితా ప్రకటించాక ప్రతి ఒక్కరికీ అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు..రెండో దశ SIRలో తెలుగు రాష్ట్రాలు లేవు. ఎస్‌ఐఆర్ ద్వారా నకిలీ ఓట్లను తొలగించడంతో పాటు ఓటర్ల జాబితాలో తప్పుల సవరణే ప్రధాన ఉద్దేశం..ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయి..
రాత్రి 12 గంటలకు ఫ్రీజ్ చేస్తాం:- “SIR జరగనున్న రాష్ట్రాల ఓటరు జాబితాను సోమవారం రాత్రి 12 గంటలకు ఫ్రీజ్ చేస్తాం..ఆ జాబితాలో ఉన్న ప్రతి ఓటరుకి BLOలు యూనిక్ ఎన్యుమరేషన్ ఫాం ఇస్తారు..BLOలు ఈ ఫాంలను ప్రస్తుత ఓటర్లకు పంపిణీ చేసిన తర్వాత, పేర్లు ఉన్నవారు 2003 ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయా అన్న విషయాన్ని పరిశీలించుకోవాలి.. ఉంటే అదనపు పత్రాలు ఇవ్వనవసరం లేదు.. వారి పేర్లు లేకపోయినా తల్లిదండ్రుల పేర్లు ఆ జాబితాలో ఉంటే కూడా అదనపు పత్రాలు ఇవ్వనవసరం లేదు.. 2002 నుంచి 2004 వరకు ఎస్‌ఐఆర్ ఓటరు జాబితా http://voters.eci.gov.in లో అందుబాటులో ఉంటుందని ప్రధాన ఎన్నికల కమీషనర్ తెలిపారు.

