DISTRICTS

మహిళల భద్రత, సంక్షేమం కోసం “సఖి వన్ స్టాప్-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో మహిళల భద్రత, సంక్షేమం,న్యాయ సహాయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో ముఖ్యమైన అడుగు పడింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల చేతుల మీదగా “సఖి వన్ స్టాప్” సెంటర్‌కు కేటాయించిన ప్రత్యేక వాహనాన్ని సోమవారం కలెక్టర్ జెండా ఊపి లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు,బాలికలు ఎదుర్కొనే హింస, వేధింపులు, వివక్ష వంటి సమస్యలకు తక్షణ సేవలు అందించడంలో సఖి వన్ స్టాప్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ వాహనం ద్వారా బాధితులకు తక్షణ చేరువ, కౌన్సిలింగ్, వైద్య, పోలీస్, న్యాయ సహాయం వంటి సేవలను వేగవంతంగా అందించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో  ICDS PD  హేన సూజన్,OSC  నోడల్ ఆఫీసర్ వి బి అనురాధ, సఖి సెంటర్ అడ్మిన్ షహనాజ్ సఖి సిబ్బంది శాఖ ప్రతినిధులు, సఖి వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, తదితరులు పాల్గొనడం జరిగింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *