ఉత్తరప్రదేశ్ లో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ ప్రెస్
అమరావతి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కార్పూర్ లో సబర్మతి ఎక్స్ ప్రెస్ (వారణాసి-అహ్మదాబాద్) శనివారం వేకువజామున 2.30 గంటల సమయంలో 22 కోచ్ లు పట్టాలు తప్పాయి..ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది..ఈ రైలు ప్రమాదం జరిగేందుకు కారణం,,,, ప్రమాద సమయంలో రైల్వే ట్రాక్ పై ఉంచిన పెద్ద బండరాయిని రైలు ఢీకొట్టింది..ఈ కారణంగానే రైలు పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు..జరిగిన సంఘటనపై ఇంటిలెజెన్స్ బ్యూరో (ఐబీ) విచారణ చేపట్టినట్లు సమాచారం.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి..ప్రాథమిక విచారణలో రైల్వే ట్రాక్ లో ఎలాంటి పగుళ్లు లేవని,,ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు లభించాయని వెల్లడించారు..ఐబీ, యూపీ పోలీసులు కూడా కేసు దర్యాప్తు ముమ్మరం చేశారని తెలిపారు..రైలు ప్రమాదంపై లోకోపైలెట్ తెలిపిన వివరాల ప్రకారం..ట్రాక్ పైన పెద్ద బండరాయిని రైలు ఇంజిన్ కు ఢీకొనడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు..రైలు ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటన స్థలికి చేరుకొని,, రైలులో ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా వారు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు..ఈ రైలుమార్గంలో పలు రైళ్లను రద్దుగా చేయడం,,మరి కొన్ని రైళ్లను మార్గం మళ్లించారు.