కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేసిన మమతా కులకర్ణి
అమరావతి: బాలీవుడ్ నటి మమతా కులకర్ణి, కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేసినట్టు అధికారికంగా ప్రకటించారు..ఈ విషయమై సోమవారం నాడు ఒక వీడియోను సామాజిక మాధ్యమంలో ఆమె షేర్ చేశారు..మమతా కులకర్ణి నియామకంపై ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి,, కిన్నర్ అఖారా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆమె తాజా నిర్ణయం తీసుకున్నారు..అమె పోస్టు చేసిన వీడియాలో మాట్లాడుతూ ”నేను (మహామండలేశ్వర్ మమత నందగిరి) నా పదవికి రాజీనామా చేశాను..ఈ విషయంలో రెండు వర్గాలు గొడవ పడటం మంచిదికాదన్నారు..నేను 25 సంవత్సరాలుగా సాధ్విగా ఉన్నాను,, ఇక ముందు కూడా అలాగే కొనసాగుతాను…25 సంవత్సరాల క్రిందటే నేను బాలీవుడ్‌ను విడిచిపెట్టాను.. అప్పటి నుంచి అందరికీ, అన్నింటికీ దూరంగా ఉంటూ వచ్చాను.. నా గురించి ప్రజలు రకరకాలుగా స్పందించడం చూశాను..నన్ను మహామండేలశ్వర్‌గా నియమించడం కొందరికి అభ్యంతరకరంగా తోచి ఉండవచ్చు..నేను కైలాస్‌కో, మానస సరోవర్‌కో వెళ్లనక్కర లేదు..25 సంవత్సరాల తపస్సుతో విశ్వం గురించి తెలుసుకుంటున్నాను అని వెల్లడించారు.