NATIONAL

2023-24 ఆర్థికసర్వేను లోక్‌ సభలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలమ్మ

అమరావతి: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి..వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టబోతున్న సందర్బంగా ఒక రోజు ముందుగా 2023-24 ఆర్థికసర్వేను ఆర్థికమంత్రి నిర్మలమ్మ లోక్‌ సభలో ప్రవేశపెట్టారు..భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్టంగా ఉందని ఈ ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు., ప్రపంచం అస్థిర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో అధిక అభివృద్ధి ఆకాంక్షలు కలిగిన దేశానికి మార్పు మాత్రమే స్థిరంగా ఉంటుందని ఈ సర్వే తెలిపిందన్నారు.. వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణం వంటి కీలకమైన ప్రపంచ సమస్యలపై ఒప్పందాలను చేరుకోవడం కష్టంగా మారిందని పేర్కొంది.

2022 నుంచి ప్రైవేటు రంగం పెట్టుబడులు పెడుతున్నప్పటికీ కొన్నేళ్లుగా ప్రభుత్వ పెట్టుబడులు మూలధనాన్ని కొనసాగించాయని ఈ ఆర్థిక సర్వే స్పష్టంచేసింది.. గడచిన రెండు సంవత్సరాలుగా 7.0 శాతం వృద్ధిరేటును నమోదు కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అధికంగా 9.7 శాతం వృద్ధిరేటు నమోదయ్యే అవకాశం ఉందని ఈ ఆర్థిక సర్వే అంచనా వేసింది.. కొన్ని నిర్దిష్ట ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ, ప్రధాన ద్రవ్యోల్బణం చాలావరకు నియంత్రణలో ఉందని తెలిపింది..ఆర్థికమంత్రిగా నిర్మలాసీతారామన్‌ 7వ సారి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *