AP&TG

నేటితో రోహిణికారై సమాప్తం వర్షాలు కురుసే అవకాశం!

అమరావతి: నేటితో రోహిణికారై సమాప్తం అయింది.రేపటి నుంచి మృగశిర కారై ప్రారంభం అవుతంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు చురుగ్గా వుండడంతో సోమ, మంగళవారాల్లో: ​అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు. ​మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

అలాగే రేపు రాష్ట్రంలోని 56 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

42°C – 44°C నమోదు కాగల జిల్లాలు: శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరి,పోలవరం,కాకినాడ, తూగో,పగో,ఏలూరు,కృష్ణా,ప్రకాశంలు…

40°C – 42°C నమోదు కాగల జిల్లాలు: కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాలు వున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *