స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిలిచి పోయిన డిజిటల్ సర్వీసులు
అమరావతి: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంక్ అన్ని డిజిటల్ సేవలు అందుబాటులో ఉండవని SBI ఒక ప్రకటనలో తెలిపింది..బ్యాంకు తెలిపిన వేళల కంటే ముందుగానే మధ్యాహ్నం 12 గంటల నుంచే UPI సేవాలు నిలిచి పోయాయి..మంగళవారం నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపధ్యంలో బ్యాంకు డిజిటల్ సర్వీసులు దాదాపు 3 గంటల పాటు అందుబాటులో ఉండవని వెల్లడించింది.. వార్షిక ముగింపు కార్యకలాపాల కారణంగా,బ్యాంకు ప్రకటించిన సమయం కంటే ముందుగానే మొబైల్ డిజిటల్ సర్వీసులు నిలిచిపోవడంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు..ముఖ్యంగా SBIలో మొబైల్ బ్యాంకింగ్, ఫండ్స్ ట్రాన్స్ ఫర్ చేసే సమయంలో ఫెయిల్ అవుతున్నాయని అనేక మంది కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.ప్రవేట్ బ్యాంకుల్లో ఇలాంటి సమస్యలు లేవు…ఒక్క SBIలో మాత్రమే ఇంక ఇలాంటి సమస్యలు వుండడం,,మనం చేసుకున్న అదృష్టం అని అనలా?