జైళ్లలో కుల ఆధారిత వివక్ష కొనసాగడం విచారకరం-సుప్రీం కోర్టు
అమరావతి: జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీల పట్ల వ్యవహరించే తీరు దారుణంగా వుందని,,స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా సమాజంలో కుల ఆధారిత వివక్ష కొనసాగడం విచారకరమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చరిత్రత్మకమైన తీర్పునిచ్చింది.. కుల ఆధారంగా వ్యవహరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది..జైలు మాన్యువల్స్ లో కులం అనే కాలమ్‌ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది..చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు,, అగ్ర కులాల వారికి వంట పనుల కేటాయింపు వివక్షే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది..జైళ్లలో కుల ఆధారిత వివక్ష, విభజన ఉందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..ఇలాంటి చర్యలు అంటరానితనం కిందకే వస్తాయని పేర్కొంది.. కులం ఆధారంగా ఖైదీలను వేరుగా ఉంచడం మార్పు తీసుకురాదని, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించడం వలసవాద వ్యవస్థకు చిహ్నమని వెల్లడించింది..కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలకు పనులను అప్పగిస్తున్నారని,,అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 3 నెలల్లో మార్చాలని సూచించారు..ఈ నిర్ణయం అమలుకు సంబంధించిన నివేదికను కూడా కోర్టులో సమర్పించాలి” అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.