ఇరుదేశాల దౌపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది-కెనడాకు ఘాటు హెచ్చరిక
అమరావతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై అక్టోబర్ 29న అట్టావాలో జరిగిన పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ ముందు ఆ దేశ మంత్రి డేవిడ్ మోరిసన్ నిరాధార ఆరోపణలు చేశారని,, దీనిపై న్యూఢిల్లీలోని కెనడా హై కమిషన్ ప్రతినిధిని పిలిపించి నిరసన తెలపడం జరిగిందని,, మోరిసన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, అసంబద్ధమైనవని పేర్కొంటూ డిప్లమాటిక్ నోట్ ఆయనకు ఇచ్చాం” అని రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు..జస్టిన్ ట్రుడో నాయకత్వంలోని కెనడా ప్రభుత్వం (ఖలిస్థానీలు) సిక్కుల ఓట్ల కోసం భారత్ పట్ల మరోసారి విషం చిమ్మింది..కెనడా భూభాగంలో ఖలిస్థాన్ అనుకూలవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ పాత్ర ఉందంటూ మంత్రి డేవిడ్ మోరిసన్ ఆరోపణలు చేయడంపై భారత్ తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపింది..న్యూఢిల్లీలో కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి మందలించినట్టు భారత విదేశాంగ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శనివారంనాడు వెల్లడించారు.. భారత్‌ను అప్రతిష్టపాలు చేయాలని వ్యూహంలో భాగంగానే నిరాధారమైన సమాచారాన్ని కెనడా ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా అంతర్జాతీయ మీడియాకు లీక్ చేస్తున్నారని, కెనడా ప్రఙుత్వ రాజకీయ అజెండా, ప్రవర్తనా విధానమే ఇందుకు కారణమని జైశ్వాల్ తప్పుపట్టారు..ఏమాత్రం బాధ్యత లేని ఇలాంటి చర్యల వల్ల ఇరుదేశాల దౌపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఘాటుగా హెచ్చరిక వ్యాఖ్యాలు చేశారు.