విలాసవంతమైన భవనాలను ఎందుకోసం నిర్మించారో రాష్ట్ర ప్రజలందరికి తెలుసు-చంద్రబాబు
అమరావతి: రాష్ట్రం వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లల్లో గుంతలు పూడ్చే కార్యక్రమంను శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లిలో శ్రీకారం ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు రుషికొండ వెళ్లారు..వైసీపీ ప్రభుత్వం హయంలో విశాఖ రుషికొండలో నిర్మించిన 7 భవనాలను చంద్రబాబు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి రుషికొండలో చేపట్టిన నిర్మాణాలను స్వయంగా ప్రతి గదిని పరిశీలించారు.. అనంతరం సీ.ఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఏ కార్యక్రమాలకు వాడుకోవాలి అనే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందన్నారు..దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేసి ఇంత ఖరీదైన విలాసవంతమైన భవనాలను ఎందుకోసం నిర్మించారో రాష్ట్ర ప్రజలందరికి తెలుసు అన్నారు.. ఆంధ్ర ఎస్కోబార్,ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు పనికి వస్తారా ? అనే విషయంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు.. అధికారులతో మాట్లాడినప్పుడు రుషికొండ భవనాల నిర్వహణ భారం ఎక్కువగా ఉందన్న తెలిపారని అన్నారు..రుషులు జ్ఞానం పొందిన ప్రదేశం రుషికొండ అని,,అలాంటి ప్రదేశంను విధ్వసం చేసి,,ఇలాంటి భవనాలు నిర్మించడం చూస్తుంటే,,ఇలాంటి వారు రాజకీయ నాయకులు పనికిరారని అన్నారు..ప్రజాధనంను దుర్వనియోగం చేసిన వారిపైన చట్ట పరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.