ఇంద్రప్రస్థ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం
అమరావతి: ఇంద్రప్రస్థ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురువేసింది..27 సంవత్సరాల తరువాత కమలం పార్టీ దేశ రాజధానిలో వికసించింది..12 సంవత్సరాలు ఢిల్లీని పాలించిన ఆప్,, ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది..ఈ ఎన్నికలు మరోసారి కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశను మిగిల్చాయి..కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేదు..అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తరువాత మొదటిసారిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు..గెలిచిన, ఓడినా ప్రజలతోనే ఉంటామని, అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తామని, ఢిల్లీ అసెంబ్లీల ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి నేను అభినందనలు తెలిచేస్తున్నాను అని అన్నారు..న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ AAP కన్వీనర్, 2 సార్లు సీఎంగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించారు.. ప్రధానమంత్రి:- ఢిల్లీలో బీజేపీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు..అభివృద్ధి, సుసంపన్న పాలన గెలిచిందంటూ పేర్కొన్నారు..ఢిల్లీలోని నా అన్నదమ్ములూ, అక్కచెల్లమ్మలకు చారిత్రక విజయం అందించినందుకు నా వందనం.. అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
(వార్త ప్రచురించే సమయానికి బీజెపీ 47 గెలిచి 1 సీటు అధిక్యంలో వుంది..అప్ 21 గెలిచి 1 సీటు అధిక్యంలో వుంది.)