AP&TG

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భేటీ

అమరావతి: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రితో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతోపాటు విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ఆయన శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మోహన్ యాదవ్ కి పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య అభివృద్ధి సంబంధితమైన పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) పరిధిలో పులుల సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేసే అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అలాగే, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో గౌర్ (అడవి దున్నలు) పునఃప్రవేశానికి సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తానని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఉప్పాడ పట్టు శాలువా, కొండపల్లి కళాకృతి బహూకరణ:- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడ పట్టు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీరామ పట్టాభిషేకం కొండపల్లి కళాకృతిని, శ్రీకాళహస్తి పెన్ కలంకారీ కళాకారులు రూపొందించిన శ్రీ దుర్గాదేవి చిత్రపటాన్ని, అరకు కాఫీని బహూకరించారు. మోహన్ యాదవ్ శ్రీ ఓంకారేశ్వర స్వామి ప్రతిమను, జ్యోతిర్లింగ క్షేత్రం నుంచి తీసుకువచ్చిన ప్రసాదాన్ని పవన్ కళ్యాణ్ కి అందజేశారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *