AP&TG

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యనవంబర్ 4, 5 తేదీల్లో ప్రభుత్వ సెలవులు

28 జిల్లాల్లో మొత్తం 9,829 ఎంపీటీసీ..

ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 5న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 4, 5 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవులుగా వర్తించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో 50 వేలకు పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 మంది అభ్యర్థులు, 659 జెడ్పీటీసీ స్థానాలకు 4,770 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తు, ఇతర ఏర్పాట్లు చేపడుతున్నారు.

28 జిల్లాల్లో మొత్తం 9,829 ఎంపీటీసీ:- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 జిల్లాల్లో మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను తుది జాబితా ప్రకారం 46,045 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో టీడీపీ నుంచి 19,760, వైఎస్సార్‌సీపీ నుంచి 17,726, జనసేన నుంచి 4,330, బీజేపీ నుంచి 1,049 మందితో పాటు 2,012 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. అలాగే 659 జెడ్పీటీసీ స్థానాలకు గాను మొత్తం 4,770 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో టీడీపీ నుంచి 1,693, వైఎస్సార్‌సీపీ నుంచి 1,445, జనసేన నుంచి 587, బీజేపీ నుంచి 227 మంది-227 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *