INTERNATIONALNATIONALOTHERS

నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు-ఎటు చూసిన భీభత్సం

రసువా జిల్లాలో అపారనష్టం..

హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్లాంట్‌ ధ్వంసం..

కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు..

1,000 మంది గల్లంత!..

సహాయక చర్యలు చేపట్టిన నేపాల్‌ సైన్యం..

బిహార్‌ సరిహద్దు జిల్లాల్లోనూ హైఅలర్ట్‌..

అమరావతి: టిబెట్ వైపు రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత గల భూకంపనలు సంభవించిన కారణంగా, భారీ మంచు చరియ విరిగిపడేలా చేసి వుండ వచ్చని, దీనివల్ల నేపాల్‌లోని భోటెకోషి నదిలో అకస్మాత్తుగా వరదలు వచ్చాయని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. బెట్‌లో బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలొ రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

1,000 మంది గల్లంత? నేపాల్-చైనా సరిహద్దుకు సమీపంలో మంచు చరియలు, కొండచరియలు విరిగిపడినట్టు శాటిలైట్ ఇమేజీల్లో కనిపించిందని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.అప్పటికే లేండే నదికి అడ్డంగా మంచు చరియలు అడ్డు పడివుండడంతో సదరు ప్రాంతంలో భారీగా నీరు నిలిచిపోయిందని ఖఠ్మాండూ యూనిర్సిటీ ప్రొఫెసర్ ఒకరు పేర్కొన్నారు. ఆటు తరువాత అకస్మాత్తుగా భూ కంపం కారణంగా మంచు చరియలు, కొండ చరియలపై పడిపోవడంతో ఎగువన ఉన్న లేండే నది నీరు భోటే కోశీ నదిలోకి పోటెత్తి ఆకస్మిక వరదలకు దారి తీసిందని వెల్లడించారు.ప్రాథమిక అంచనల ప్రకారం ఇవ్పటి వరకు దాదాపు 1,000 మంది గల్లంతు కాగా చాలా మంది మరణించి వుండ వచ్చని అధికారులు అంచనే వేస్తున్నారు. సంబంధిత శాఖల అదికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే దానిపై నిపుణులు పరిశీలిస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *