AP&TGDISTRICTS

తిరుపతిలో ఒక్కసారిగా కుప్పకూలి పోయిన 4 అంతస్తుల భవనం

తిరుపతి: తిరుపతిలో 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. పట్టణంలోని ఆర్‌సీ రోడ్డులో కలశం బిల్డింగ్ సమీపంలోని గ్యాస్ గోడౌన్ వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నూతన భవనం నిర్మాణం కోసం గుంతలు తీస్తున్న సమయంలో పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనం కూలిపోయినట్లు సమాచారం. పునాదులు తవ్వుతున్న సమయంలో నాలుగు అంతస్తుల భవనానికి బీటలు రావడంతో అందులో నివసిస్తున్నవారు అప్రత్తమై ఖాళీ చేశారు. దీంతో పెను ప్రాణనష్టం తప్పింది.అయితే ఈ సంఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది శిథిలాలను తొలగించారు. శిథిలాల మధ్య ఎవరు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *