AP&TGCRIMEPOLITICS

వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

లెక్క చూపని రూ.24 లక్షలు సీజ్‌..

ఏకకాలంలో ఏడు ప్రాంతాల్లో సోదాలు..

అమరావతి: వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో లెక్క చూపని రూ.24 లక్షలు సీజ్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రకటించింది. శుక్రవారం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన చేసింది. ఎంపీ నివాసంలో రెండు బ్యాంక్‌ లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. నెల రోజుల ముందే వివేకా హత్యకు కుట్ర జరిగిందని దస్తగిరి వెల్లడించారని గుర్తు చేసింది. హత్య కోసం దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఆఫర్‌ చేశారని, రూ.40 కోట్లలో వాటాగా రూ.5 కోట్లు, దస్తగిరికి ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి ప్రలోభపెట్టారని ఈడీ తెలిపింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, చార్జ్‌ షీట్లు ఆధారంగా ECIR నమోదు చేసినట్లు తెలిపింది.IPC (121B), 302 సెక్షన్‌ PMLA కింద కేసు నమోదు చేశామని ఈడీ వివరించింది. ఈ సోదాల్లో నేరానికి సంబంధించిన, కీలక డాక్యుమెంట్లు, డిజిటల్‌ పరికరాలు సీజ్‌ చేశామని ఈడీ వెల్లడించింది. హైదరాబాద్‌, కడప నగరాల్లోని మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు ఈడీ వివరించింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *