అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే సమస్యలు తప్పవు?
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలందరు, అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయరాదని, అటువంటి లేఅవుట్లలలో భవన అనుమతులు పొందుట వీలుకాదని,లేఅవుట్ ప్లాట్లకు ఆర్థిక సంస్థలు/బ్యాంకులు ద్వారా రుణాలు మంజూరు చేయరని,,కొనుగోలుదారులు తప్పుడు యాజమాన్య హక్కుల వివాదాలకు, ద్వంద్వ రిజిస్ట్రేషన్లకు, చట్టపరమైన వివాదాలకు గురయ్యే అవకాశం ఉందని కార్పరేషన్ అధికారి నందరన్ తెలిపారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ ఇటువంటి పరిణామాలను నివారించడానికి, ప్రజలు RERAలో నమోదు చేసిన లేఅవుట్లలో మాత్రమే ప్లాట్లు కొనుగోలు చేయాలన్నారు.
అక్రమ లేఅవుట్లను అరికట్టే ప్రయత్నంలో భాగంగా, పట్టణ-గ్రామీణ ప్రణాళికి సంచాలకులు (DTCP) కార్యాలయంలోని సీనియర్ అధికారులు, ప్రాంతీయ పట్టణ-గ్రామీణ ఉప సంచాలకులు, పట్టణ అభివృద్ధి సంస్థ (UDA) అధికారులు-మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ (ULB) పట్టణ ప్రణాళిక అధికారులు కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు..డీటీసీపీ కార్యాలయానికి తరచుగా ఫిర్యాదులు వచ్చే ULBలు/UDA లలో ఆకస్మిక తనిఖీలు జరుగుతున్నాయన్నారు.
సదరు తనికీలలో భాగంగా, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో క్రింద పేర్కొన్న అనధికార లే-అవుట్లను గుర్తించడం జరిగినదని, గుర్తించిన అనధికార లే-అవుట్లను A.P. మునిసిపల్ కార్పొరేషన్ చట్టం, 1955 ప్రకారం DTCP సిబ్బంది, మున్సిపల్ అధికారుల సమక్షంలో చర్యలు తీసుకొవడం జరిగిందన్నారు.
తనిఖీలలో చర్యలు తీసుకున్న అనధికార లే-అవుట్ల వివరాలు:- 1. “గార్డెన్ సిటీ ఎక్స్ టెన్షన్” (అంబాపురం) – సర్వే నెంబర్లు: 68, 69, 79, 80, 81 – 2: 2||17.54.
- “శ్రీ సాయి బృందావనం స్మార్ట్ సిటీ” – ఫేజ్ A” (2) – 2 : 279A, 279B, 281/1, 281/2, 282, 286/C, 287, 288, 308, 313A, 314B, 315, 317A, 317B – 2: 2||17.30 .
- “శ్రీ సాయి బృందావనం స్మార్ట్ సిటీ – ఫేజ్ B” సర్వే 3໙໖: 305, 313, 317, 318, 320 – 2໖໐: 220.00 సెంట్లు,
- శ్రీ సాయి నగర్ – ఫేజ్ I & II” (బలిజపాలెం)-సర్వే 3: 957, 959, 960, 962, 1059, 1060/A, 1060/B విస్తీర్ణం:
ఎ||10.83 సెంట్లు
హెచ్చరిక-చర్యలు:- A.P. Layouts Rules, 2017 ను అనుసరించి అనధికార లే అవుట్లలోని ప్లాట్లపై ఎలాంటి కొనుగోలు, అమ్మకం లేదా లావాదేవీలు జరగకుండా, రిజిస్ట్రార్, నెల్లూరు-విద్యుత్ శాఖ వారికి సూచనలు జారీ చేయడమైనదన్నారు.ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఇవ్వకుండా ఎలక్ట్రికల్ శాఖ వారికి కూడా లేఖలు పంపించడమైనదన్నారు..అనధికార లే-అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలకు-లే-అవుట్ యజమానులకు, లే-అవుట్ నియమాల గురించి వివరణాత్మకంగా తెలియజేయడమైనదని తెలిపారు.
ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లభించవు:-అనధికార లే-అవుట్లలో ప్లాట్లు కొన్న వారికి ప్రభుత్వం నుండి మౌలిక సదుపాయాలు లేదా భవన అనుమతులు మంజూరు చేయడం జరగదన్నారు.అనధికార లే-అవుట్లలో భవనాలు నిర్మించినట్లయితే, అటువంటి భవనాలను అనధికారంగా గుర్తించి, A.P. మునిసిపల్ కార్పొరేషన్ చట్టం, 1955 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు..