పూడికతీతకు జెన్ రోబోటిక్స్ మిషన్ పనితీరు పరిశీలన
నెల్లూరు: మేజర్,మైనర్ డ్రైన్ కాలువలలో పూడికతీత పనుల కోసం రూపొందించిన నూతన మిషన్ ను ప్రయోగాత్మకంగా ఉపయోగించి ఫలితాలను నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పరిశీలించారు. స్థానిక రామ్మూర్తి నగర్ ప్రాంతంలోని ప్రధాన డ్రైన్ కాలువకు జెన్ రోబోటిక్స్ మెషిన్ ను అనుసంధానించి పూడికతీత పనులను మంగళవారం చేపట్టారు..మిషన్ పనితీరును పరిశీలించిన కమిషనర్ డ్రైను కాలువల పూడికతీత కన్నా లోతైన బావులు నుంచి పూడికను తొలగించేందుకు ఈ మిషన్ అనువుగా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ శ్రీనివాసులు, ఏ.ఈ పాల్గొన్నారు.