9న ఆత్మకూరుకు మంత్రులు ఫరూక్,నారాయణ, సవిత, బిసి జనార్దన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డిలు
మంత్రి ఆనం ఆధ్వర్యంలో..
నెల్లూరు: ఆత్మకూరు పట్టణంలో ఈనెల 9న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఐదుగురు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ మేరకు మంత్రుల పర్యటన ఖరారైంది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఫరూక్, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, రాష్ట్ర రహదారులు, భవనములశాఖ మంత్రి బిసి జనార్దన్‌రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈనెల 9న ఆత్మకూరుకు చేరుకోనున్నారు. 9వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఆత్మకూరు టిడ్కో గృహ సముదాయంలో శ్రీ సీతారాములు స్వామివారి ఆలయానికి భూమిపూజ, ఉదయం 10.30 గంటలకు పంచాయతీరాజ్ అతిథిగృహ నిర్మాణానికి శంకుస్థాపన, 11 గంటలకు ఆర్‌అండ్‌బి అతిథిగృహం ప్రారంభోత్సవం, 11.30 గంటలకు నూతన బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆత్మకూరు బిసి ఆర్‌ఎస్ బాలికల పాఠశాలలో పాత్రికేయుల సమావేశం అనంతరం పాఠశాలల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. ఈ కార్యక్రమాలకు ఆయాశాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.