శ్రీసిటీలో ముఖ్యమంత్రి పర్యటన-జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్
శ్రీసిటీ, తిరుపతి: ముఖ్యమంత్రి ఈ నెల 19న శ్రీసిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో శ్రీసిటీలో పర్యటన ఏర్పాట్లపై అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీసిటీ సెజ్ లో 8 పరిశ్రమలకు భూమి పూజ, 16 పరిశ్రమల ప్రారంభానికి, 5 పరిశ్రమలకు ఎంఓయులు చేపట్టనున్నారు అని తెలిపారు.
ముఖ్యమంత్రి సోమవారం ఉదయం 11.30 గం లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుండి హెలికాప్టర్ లో 11.40 గం లకు బయలుదేరి శ్రీ సిటీకి 11.55 గం.ల కు చేరుకుంటారనీ, అక్కడి నుండి రోడ్డు మార్గాన శ్రీసిటీ లోని బిజినెస్ సెంటర్ కు మధ్యాహ్నం 12.10 గం.లకు చేరుకుని 2.30 గం. ల వరకు బిజినెస్ సెంటర్ లో పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేసి పలువురు పరిశ్రమల సిఈఓ లతో సమావేశంలో పాల్గొంటారని తెలిపారు..అనంతరం శ్రీసిటీ పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలో సోమశిల సాగునీటి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శిస్తారు. అనంతరం రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లనునన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి లు కులశేఖర్, రాజేంద్ర, ఆర్డీఓ కిరణ్ కుమార్, జోనల్ మేనేజర్ ఏపీఐఐసి చంద్ర శేఖర్,ఆర్ అండ్ బి ఎస్ ఈ మధుసూధన్ రావు, శ్రీసిటీ ప్రతినిధులు పీ. ముకుంద రెడ్డి రెసిడెంట్ డైరెక్టర్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.