బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర అపశ్రుతి-8 మంది మృతి?
అమరావతి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి ఐపీఎల్ విజయంతో బుధవారం జరిగిన వేడుకలు విషాదకరంగా మారాయి..చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 50 మందికి పైగా అభిమానులు గాయపడి అస్వస్థతకు గురి కాగా 8 మంది మరణించి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్పు సాధించిన ఆనందంలో అభిమానులు భారీగా చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు.. స్టేడియం లోపలికి అభిమానులు బారికేడ్లు దూకి స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు..దీంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది..అభిమానులను నియంత్రించేందుకు చిన్నస్వామి స్టేడియం దగ్గర పోలీసులు లాఠీఛార్జ్ చేశారు..స్టేడియం ఖాళీ చేయాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు..పూర్తి సమాచారం అందాల్సి వుంది.