పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖకు వరల్డ్ రికార్డ్
అమరావతి: పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఆ శాఖ ప్రపంచ రికార్డ్ ను సృష్టించింది.. ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించినందుకు గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గౌరవం దక్కింది..ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ, ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 23 తేదిన ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ప్రభుత్వం నిర్వహించింది..ఈ స్థాయిలో గ్రామ సభలను నిర్వహించడాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది..ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని,సోమవారం ఉదయం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు..ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలియజేశాడు.. పంచాయతీరాజ్ గ్రామీణాభిశృద్ధి శాఖకు ప్రపంచ రికార్డు వరించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు..ఆంధ్రప్రదేశ్ గ్రామ స్వరాజ్య దిశగా దూసుకెళ్తుతుందని అయన పేర్కొన్నారు.