30 సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతున్నఇధ్దరు ఉగ్రవాదులు అరెస్ట్
అమరావతి: ఉగ్రవాదుల అరెస్ట్ తో అన్నమయ్య జిల్లాలోని రాయచోటి పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.. మంగళవారం రాయచోటిలో నివాసం వుంటున్న అబూబక్కర్ సిద్ధిఖీ,,మహమ్మద్ అలీ అనే ఇద్దరు సోదరులను, తమిళనాడుకు చెందిన యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) 2 నెలలుగా వీరిపై నిఘ పెట్టి అరెస్ట్ చేసింది..అనంతరం వారిని భారీ భద్రత మధ్య తమిళనాడుకు తరలించారు..ఉగ్రవాదులు 1995లో కోయంబత్తూరు పేలుళ్ల కేసులోను,, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ రథయాత్ర సందర్భంగా కుట్ర చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి..గత 30 సంవత్సరాలుగా వీరిద్దరు మారు పేర్లతో రాయచోటిలో పట్టణంలోని కొత్తపల్లి ఉర్దూ స్కూల్ ఎదుట అబూబక్కర్ సిద్ధిఖీ, చిల్లర దుకాణం నడుపుతున్నారు..అలాగే షేక్ మన్సూర్@ మహమ్మద్ అలీ సైతం రాయచోటిలో మహబూబ్ బాషా వీధిలో చీరలతోపాటు చిల్లర కొట్టుతో వ్యాపారం చేస్తూ స్థానికులకు అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరిద్దరిపై ఇప్పటికే పలు కేసులు నమోదయినట్లు తెలుస్తుంది..ఈ ఉగ్రవాదులు దాదాపు 200 మందికి పైగా ఉగ్రమూకలకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం..దీంతో పోలీసు బృందాలు చాలా లోతుగా విచారణ చేస్తున్నాయి.