AP&TG

నేషన్ ఫస్ట్ అనే విధంగా అందరూ ఆలోచన చేయాలి-సీఎం చంద్రబాబు

సీజేఐ బీఆర్ గవాయ్ కు స్వాగతం..
అమరావతి: జస్టిస్ గవాయ్ తన విధి నిర్వహణలో భాగంగా మంచి తీర్పులు ఇచ్చారు.. ప్రజలంతా ఆ తీర్పులు గుర్తు పెట్టుకునేలా ఉంటాయి..ఇలాంటి సందర్భంలో అంబేద్కర్ ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు..ఆదివారం అమరావతిలో 75 ఏళ్ల భారత రాజ్యాంగంపై జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేను సీఎంగా, సీజేఐగా గవాయ్, ఏపీ సీజేగా ధీరజ్ సింగ్ ఠాకూర్ విధులను రాజ్యాంగబద్దంగా నిర్వహిస్తున్నాం అన్నారు.. ఛాయ్ వాలాగా జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారంటే దానికి కూడా భారత రాజ్యాంగమే కారణం అన్నారు.. ప్రధానిగా నరేంద్ర మోదీ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు..సంస్కరణల తర్వాత ప్రజల ఆలోచనా విధానం మారింది… పరిస్థితులు మారుతున్నాయ తెలిపారు.. చాలా దేశాలు యువత లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి… కానీ భారత దేశానికి అలాంటి సమస్య లేదన్నారు..
• మన దేశంలో పెద్ద ఎత్తున మానవ వనరులు అందుబాటులో ఉందని,,యువశక్తిని సరైన దిశలో నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలిపేలా ప్రధాని పని చేస్తున్నాన్నారు..2047 నాటికి ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రభావం చూపే స్ధాయికి చేరుకుంటారన్నారు..
• సమాజంలో ఏమైనా తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్ది ప్రజాస్వామ్యాన్ని రక్షించేది న్యాయ వ్యవస్థ అని,, సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరూ ఎడిటర్ అయిపోతు,,వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సదస్సుకు హజరైన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, ఏపీ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్,న్యాయమూర్తులు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *