AP&TG

పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీ, పెనుమార్పునకు నాంది పలుకుతుంది-సీ.ఎం చంద్రబాబు

సంకల్పం ఉంటేనే ఏదైనా-పవన్ కళ్యాణ్..

అమరావతి: పర్యావరణ హితమైన గ్రీన్ అమ్మోనియా ఎనర్జీ భవిష్యత్తులో పెనుమార్పునకు నాంది పలుకుతుందని,, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ఎనర్జీ ఉత్పత్తి పరిశ్రమకు కాకినాడలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు,,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఇంధన రంగంలో ఇదో చారిత్రక మైలురాయిగా నిలవనుందని,,రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం కాకినాడ వైపు చూస్తుందని తెలిపారు. మన సంస్కృతిని కాపాడుకుంటూ టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరచిపోవద్దని చెప్పారు. ఆనాడు నాగార్జున ఫెర్టిలైజర్స్ (NFCL) ఏర్పాటులో దివంగత ఎన్టీఆర్ ఎంతో చొరవ చూపారని.. గ్రీన్ అమ్మోనియా భవిష్యత్‌లో పెను మార్పునకు నాంది పలుకుతుందని తెలిపారు. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియాను జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేయనున్నారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎరువులు, పురుగు మందుల వినియోగం బాగా తగ్గించాలని, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచాలని ప్రధాని మోదీ కోరుతున్నట్లు గుర్తు చేశారు.

పవన్ కళ్యాణ్:- పర్యావరణాన్ని రక్షించుకుంటూ గ్రీన్ హైడ్రోజన్ దిశగా మన రాష్ట్రం వేసే అడుగులు చాలా కీలకమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. సమాజంకు మేలు చేసేందుకు బలమైన సంకల్పం ఉంటేనే ఏదైనా సాధించగలమన్నారు. అనేక కష్టనష్టాలను తట్టుకుని AM గ్రీన్ కంపెనీ ఏర్పాటు చేసిన చలమలశెట్టి అనిల్‌,, మహేశ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. AM గ్రీన్‌ కంపెనీ 495 ఎకరాల్లో ఏర్పాటు కానుందని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు.క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వెల్లడించారు.కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో ఇదో మైలురాయి అని, రాష్ట్ర సుస్థిరాభివృద్ధిలో ఇది గేమ్ ఛేంజర్ కానుందని పవన్​ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినా పాలనా విధానాలు స్థిరంగా ఉండాలని,, ఆ దిశగా వేసిన బలమైన అడుగు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *