థియోటర్లు,ప్రేక్షకులకు ఏ మేరకు సదుపాలయాలు కల్పిస్తున్నారొ పరిశీలించండి-పవన్ కళ్యాణ్
అమరావతి: గత వారం రోజుల నుంచి నిర్మాతలు-ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్స్ సమస్య జఠిలంగా మారుతొంది.. థియోటర్లు బంద్ చేయాలనే నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టాలీవుడ్ పై, థియేటర్స్ పై సీరియస్ అయ్యారు.. రాష్ట్రంలో థియోటర్ల యాజమానులు ప్రేక్షకులకు ఏ మేరకు సదుపాలయాలు కల్పిస్తున్నరనే విషయంపై సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పవన్ ఆదేశించారు.. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని మంత్రి దుర్గష్ కు సూచించారు..టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాల త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చెయ్యాలి, ఇందులో తనమన బేధాలు పాటించవద్దు అని తెలిపారు..అలాగే ప్రేక్షకులు సినిమా హాల్ వరకూ రావాలంటే ఏం చేయాలనే దానిపై చర్చించారు.. టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల వీపరితమైన ధరలు ఉండటంపై చర్చించారు..వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.