AP&TGMOVIESOTHERS

హాస్య నటుడు ఫిష్ వెంకట్ మృతి

హైదరాబాద్: హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్‌గా మాండలికంలో మాట్లాడుతూ ప్రేక్షకులను అకట్టుకున్ననటుడు ఫిష్ వెంకట్(53) (మంగిలపల్లి వెంకటేష్‌) రెండు కిడ్నీలు దెబ్బతినడంతో,పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి కన్నుమూశారు..ఆయన గత కొన్ని నెలలుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు..ఇటీవల ఆయనను వెంటిలేటర్ పై ఉంచారు.. కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంట్ చేయించుకునేందుకు ప్రయత్నించినప్పటికి, దాతలు దొరకకపోవడంతో ఆయన పరిస్థితి మరింత దిగజారింది..ఫిష్ వెంకట్ గబ్బర్ సింగ్, అధుర్స్, డీజే తిల్లు వంటి దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించారు.. ఆయన కుమార్తె శ్రావంతి ఆర్థిక సాయం కోసం అభ్యర్థించగా, పవన్ కల్యాణ్, విశ్వక్ సేన్ వంటి నటులు సహాయం అందించారు..ఫిష్ వెంకటేష్‌ కుటుంబీకుల స్వస్థలం బందరు..గంగపుత్ర వర్గానికి చెందిన ఆయన కుల వృత్తిగా చేపల వ్యాపారం చేసేవారు..దింతో అయనకు ఫిష్‌ వెంకటేశ్‌గా పేరు వచ్చింది ..దివంగత నటుడు శ్రీహరి, ఫిష్‌ వెంకట్‌కు మంచి స్నేహితుడు. ఆయన ప్రోద్భలంతోనే వెంకట్‌ సినిమాల్లో కొనసాగారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *