టీఎంసీ ఎం.పీ మహువా మొయిత్రాకి కోడిగుడ్ల మర్దన
అమరావతి: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తరువాత స్థానిక ప్రజల్లో మమతా బెనర్జీ పార్టీ అయిన TMCపై ద్వేషం,కోపం, చల్లారడం లేదు. TMC ప్రభుత్వం అధికారం వెలగబెట్టిన ముఖ్య నాయకులపై కోడిగుడ్ల రూపంలో కోపం తీర్చుకుంటున్న సంఘటనలు అడపదడప కన్పిస్తునే వున్నాయి…ఈ కోవలోనే…
మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పైనా, కొందరు మాజీ మంత్రులపైన కోడిగుడ్లు,టమోటాలతో మర్దనలు జరిగాయి.నేడు అవినితి ఆరోపణలు ఎదుర్కొన్న మహిళా ఎంపీపై మహువాపై స్థానిక ప్రజలు కోడిగుడ్లు దాడికి పాల్పడ్డారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణం వద్ద టీఎంసీ కార్యకర్తలతో మాట్లాడుతున్న ఆమెపై కొందరు కోడిగుడ్లతో నిరసన తెలిపారు. తనపై దాడి జరిగిన విషయాన్ని మహువానే స్వయంగా ధ్రువీకరించారు. బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఇది బెంగాల్ పోలీసుల ఫెయిల్యూర్ అని పేర్కొన్నారు. మహువా మొయిత్రా ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించలేదు.

