AP&TG

క్వాంటం వ్యాలీకి 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణం-మంత్రి కేశవ్

సీ.ఎం చంద్రబాబు అధ్యక్షతన కేమినెట్ మీటింగ్…

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయలను తీసుకుంది. మంత్ర వర్గ సమావేశంలో తసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. హోంశాఖలో కానిస్టేబుళ్లుగా ఉన్న 358 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించడంతో పాటు న్యాయ శాఖలో 21 పోస్టులు కొత్తగా క్రియేట్ చేశామని తెలిపారు. పంచాయితీ రాజ్ శాఖలో 20 పోస్టులు సప్రస్ చేసి, అవసరం ఉన్న చోట ఆ పోస్టులను క్రియేట్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు అదనంగా నిధులు కేటాయింపులు చేశామన్నారు. ఢిల్లీలో 11.53 ఎకరాల్లో రూ.124.5 కోట్లతో కొత్తగా ఏపీ భవన్‌ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొత్త ఏపీ భవనానికి ఏదైనా మంచి పేరు సూచించాలని సీఎం చంద్రబాబు కోరారన్నారు.

క్వాంటం వ్యాలీకి 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణం:- రూ.443 కోట్లతో కృష్ణానది కరకట్టను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నమన్నారు. రాజధాని అమరావతిలో ఆఫీసుల కాంప్లెక్స్‌ లకు సంబంధించి సెక్రటేరియట్, జీఏడీ టవర్స్‌, గ్లాస్ క్లాడింగ్, క్రౌన్ ఏర్పాటుకు రూ.2,540 కోట్ల కేటాయించినట్లు మంత్రి పయ్యావుల తెలిపారు. సెల్ అండ్ కోర్ స్ట్రక్చర్ కోసం రూ.1,200 కోట్లు, క్వాంటం వ్యాలీకి 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణం ఉంటుందన్నారు. ఒక్కొక్కటి 43 టవర్స్ ఉంటాయని,రెండు టవర్స్‌ లోనే అన్నిసౌకర్యలు కల్పిస్తామన్నారు. సీఆర్డీఏకు కొత్త కేటాయింపులు ఇవ్వడానికి అనుమతివ్వడం జరిగిందన్నారు. సెబీ, స్వామి నారాయణ్, డీఏవీ పబ్లిక్ స్కూల్‌కు భూములు ఇవ్వాలని సీఆర్డీఏ చేసిన సిఫార్సులను అమోదించామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. మంత్రివర్గం సమావేశంలో దాదాపు 41 అజెండా అంశాలకు ఆమోదం తెలిపామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *