CRIMENATIONAL

రామాయణంపై ప్రకాష్ రాజ్ ఎటకారం–భగ్గుమంటున్న హిందూ సంఘాలు

ప్రకాష్ రాజ్ పై కేసు నమోదు....

(ఈలాంటి వారిని అదరిస్తున్న మన సినిమా ప్రేక్షకులను ఏం అనాలి.?? వీరు హిందుకు మతం గురించి అయితే మాత్రం రెచ్చిపోయి నోటికి వచ్చింది మాట్లాడుతారు. ఇదే సమయంలో మరో మతం గురించి మాట్లాడే కనీసం ధైర్యం కూడా చేయారు..?)

అమరావతి: హిందూ ధర్మంలో అత్యంత పూజనీయమైన శ్రీరాముడిపై సినీమ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న సందర్బంలో ఆయన రామాయణాన్ని వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను బలంగా దెబ్బతీశాయి. రాముడు, లక్ష్మణులను ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ‘వలస కూలీలు’గా అభివర్ణించడమే కాకుండా, వారు రావణుడి పొలంలో పండ్లు దొంగిలించారంటూ ఎద్దేవా చేయడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

శూర్పణఖ 2000 డాలర్ల జీఎస్టీ:- శ్రీరాముడు,లక్ష్మణుడిని,,, శూర్పణఖ 2000 డాలర్ల జీఎస్టీ అడిగిందంటూ ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ప్రకాష్ రాజ్ రాజకీయ విమర్శలు చేస్తూ పవిత్ర ఇతిహాసాలను కించపరచడంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఒక దేశ సంస్కృతికి, నమ్మకానికి ప్రతీకలైన దేవుళ్లను ఇలాంటి చిల్లర వ్యాఖ్యలతో అవమానించడం సిగ్గుచేటని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మతపరమైన మనోభావాలను కించపరిచినందుకు ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. నిరంతర వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ప్రకాష్ రాజ్, ఈసారి హద్దులు దాటారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సినిమాల నుంచి బహిష్కరించాలి:- శ్రీరాముడిని అవమానించిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌ను సినిమాల నుంచి బహిష్కరించాలనే డిమాండ్ పెరుగుతొంది. ముఖ్యంగా ఎస్.ఎస్. రాజమౌళి ‘వారణాసి’, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’,-‘దృశ్యం 3’ వంటి చిత్రాల నుంచి ఆయన్ను తొలగించాలని హిందువులు నిర్మాతలు, దర్శకులను కోరుతున్నారు. ప్రజల విశ్వాసాలను గౌరవించని నటులకు భారీ ప్రాజెక్టులలో అవకాశం ఇవ్వడంపై పునరాలోచించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ప్రకాష్ రాజ్ పై కేసు నమోదు:- ఢిల్లీకి చెందిన లాయర్ అమితా సచ్ దేవ్ దక్షిణ ఢిల్లీలోని సైబర్ పెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ప్రకాష్ రాజ్ పై సెక్షన్-99, 302, 196, 352 & 353 BNS లను ఐటీ చట్టంతో కలిపి నమోదు చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *