DISTRICTS

ఎల్.ఆర్.ఎస్ పథకం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి-కమిషనర్ వై.ఓ నందన్

నెల్లూరు: నగరపాలక సంస్థ L కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అనధికార లేఔట్ లో ప్లాట్ల యజమానులకు చట్ట బద్ధహక్కులు కల్పించే ఎల్.ఆర్.ఎస్ పథకం అవకాశాన్ని సద్వినియోగంL చేసుకోవాలని సూచించారు. అనధికార లేఔట్ లోని ప్లాట్ల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం క్రమబద్ధీకరణ పథకం ఎల్.ఆర్.ఎస్ 2025 తేదీ 23 జనవరి 2026, ముగియనున్నదని, ఇప్పటివరకు వరకు క్రమబద్ధీకరించుకొని లేఅవుట్ల, ప్లాట్ల యజమానులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమబద్ధీకరించుకోని లేఅవుట్లు, ప్లాట్లలో నెల్లూరు నగరపాలక సంస్థ నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కల్పన ఉండబోదని యజమానులు గుర్తుంచుకొని తప్పనిసరిగా అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఎల్.ఆర్.ఎస్ 2025 పథకం ద్వారా క్రమబద్ధీకరణకు ఇప్పటివరకు 2145 దరఖాస్తు చేసుకోగా వారిలో 498 మంది దరఖాస్తులను ఆమోదించి వారి లేఔట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించామని కమిషనర్ తెలిపారు. అంటే సుమారుగా దరఖాస్తు చేసుకున్న వారిలో పాతిక శాతం క్రమబద్ధీకరణ జరిగిందని, మరో 1064 దరఖాస్తులు వివిధ దశలలో అనుమతుల కోసం ఆన్లైన్లో ఉన్నాయని తెలిపారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలు ద్వారా నెల్లూరు నగరపాలక సంస్థకు సుమారుగా 11 కోట్ల రూపాయల ఆదాయం ఇప్పటివరకు వచ్చిందని కమిషనర్ తెలిపారు.
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ఖాళీగా ఉన్న స్థలాల యజమానులు వారి స్థలాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రంగా ఉన్న స్థలాలపై ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఖాళీ స్థలాల యజమానులు అందరూ బాధ్యతగా క్రమం తప్పకుండా తమ స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకొని, చుట్టుపక్కల వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
అపరిశుభ్రంగా ఉన్న స్థలాల యజమానులు స్పందించని పక్షంలో కార్పొరేషన్ ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టి యజమానులపై అపరాధ రుసుము, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. నగరవ్యాప్తంగా ఉన్న అన్ని ఖాళీ స్థలాలలో నగరపాలక సంస్థకు సంబంధించిన హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేసి ఉన్నామని, యజమానులు అందరూ వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా కమిషనర్ తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *