సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తులో తూర్పు గాలుల ద్రోణి
రాగల మూడు రోజుల వరకు..
అమరావతి.: నైరుతి బంగాళాఖాతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో తూర్పు గాలుల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొమొరిన్ ప్రాంతం నుండి రాయలసీమ వరకు, అంతర్గత తమిళనాడు మీదుగా ఒక తూర్పు గాలుల ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్-యానములో దిగువ ట్రోపోఆవరణములో ఈశాన్య,,తూర్పు గాలులు వీస్తున్పాచపి తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా వున్నాయి:-
కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- మంగళ,బుధ,గురువాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30నుండి 40కి.మీ గరిష్ఠంగా 50 కి. మీ వేగంతో వీచే అవకాశం ఉంది. పొగ మంచు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:- మంగళ,బుధ,గురువాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30నుండి 40కి.మీ గరిష్ఠంగా 50 కి. మీ వేగంతో వీచే అవకాశం ఉంది. పొగ మంచు కురిసే అవకాశం ఉంది.

