AP&TGCRIME

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం-ఏడుగురు మృతి

అమరావతి: అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలో రోడ్డు ప‌నుల కోసం అమ‌ర్చిన జిలెటిన్ స్టిక్స్ పేలి  ఏడుగురు దుర్మ‌ర‌ణం చెందగా, ప‌లువురు గాయ‌ప‌డ్డారు. అనంతగిరి మండలం పినకోట వద్ద శ‌నివారం ఉద‌యం ఈ ప్ర‌మాదం జరిగింది. రోడ్డు ప‌నుల కోసం జిలెటిన్‌ స్టిక్స్‌ ను అమర్చిన ప్రత్యేక పరికరాన్ని వినియోగించారు. ఈ యంత్రంలో డీజిల్‌ నింపుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. జిలెటిన్‌ స్టిక్స్‌ పేలుడు ధాటికి రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఈ ఘటనలో డ్రైవర్‌, ఐదుగురు కార్మికులు మృతి చెందగా, పేలుడు సమయంలో అటుగా వెళ్తున్న ఉపాధ్యాయురాలు సునీత కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మరణించిన వారిలో విశాఖకు చెందిన టీచర్ సునీత, దేవరాపల్లికి చెందిన కార్మికుడు మణి, చీడికాడకు చెందిన నారాయణరావు, కడపకు చెందిన పవన్‌ కుమార్, డ్రైవర్​ ప్రవీణ్, అసోంకి చెందిన హెల్పర్​ నసీరుద్దీన్​, బిహార్​కు చెందిన ఆపరేటర్​ టింకు​గా గుర్తించారు. పినకోట పరిధిలోని మద్దిరెబు ఎంపీపీ పాఠశాలలో సునీత టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె పాఠశాలకు వెళ్తుండగా జిలెటిన్ స్టిక్స్ పేలింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్థానిక అధికారులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేర‌కుని ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *