విద్యార్దులు చదువులతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి-మంత్రి నారాయణ
వీఆర్సీ గ్రౌండ్ లో నూతన హంగుల..
నెల్లూరు: వీఆర్సీ గ్రౌండ్ లో బాస్కెట్ బాల్ కోర్టుల ఆధునీకరరణ,ఓపెన్ జిమ్,వాకింగ్ ట్రాక్,స్విమ్మింగ్ ఫూల్,డ్రెసింగ్ రూమ్స్,,టాయిలెట్స్ ఏర్పాటుకు కుమార్తె షరణితో కలిసి మంత్రి నారాయణ మంగళవారం శంకుస్థాపన చేశారు.ఈసందర్బంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ విద్యార్దిని విద్యార్దులకు చదువులతో పాటు ఆటపాటలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.నగరంలో మూడు ప్రభుత్వ హైస్కూల్స్ లో స్విమ్మింగ్ ఫూల్స్ కూడా ఏర్పాటు చేస్తాము అన్నారు.
రాష్ట్రమంతా ఆదర్శంగా తీసుకున్నారు:- విఆర్ హైస్కూల్ ను కార్పరేట్ పాఠశాల స్థాయిలో అధునికరించిన తరువాత స్కూల్ ప్రారంబించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. విఆర్ హైస్కూల్ మోడల్ ను రాష్ట్రమంతా ఆదర్శంగా తీసుకున్నారన్నిరు. అదే తరహాలోనగరంలోని DSR,RSR స్కూల్స్ ని ప్రారంభించామన్నారు. స్కూల్స్ అధునికరణ చూసి రాష్ట్రమంతా అభినందిస్తుంటే వైసిపి నాయకులు విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి, వైఎస్ఆర్సీపీ నేతల అవాకులు చవాకులను నేను పట్టించుకోను అని అన్నారు. సిటీ నియోజక వర్గంలో 18 హైస్కూల్స్ ని ఆధునీకరిస్తున్నామని ఇందుకు CSR ఫండ్స్ క్రింద ఉన్నత స్థాయిలో ఉన్న నా స్నేహితులని,స్టూడెంట్స్ ని అడిగి స్కూల్స్ అభివృద్ధికి నిధులు సేకరిస్తాను తెలిపారు.
విఆర్సీలో జెండా పోల్ ఏర్పాటుకు 20 వేల విరాళం ఇచ్చిన డాక్టర్ పోకల రవిని మంత్రి నారాయణ అభినందించి, విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ పంపిన ప్రశంసాపత్రాన్ని పోకల రవికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ హిమబిందు,ఎస్ఈ జానీ,డిఈఓ బాలాజీ రావు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,టీడీపీ నాయకులు యశ్వంత్ రెడ్డి,డాక్టర్ పోకల రవి,సుజన్,పిట్టి సత్యనాగేశ్వర రావు,ఏడుకొండలు,వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సుబ్బా రెడ్డి,బాస్కెట్ బాల్ ప్లేయర్ బాబు,నన్నే సాహెబ్,కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.
