అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జునరావుతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో లోక్ భవన్ దర్బార్ హాల్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయించారు.